కొమురం భీముడు
ప్రముఖ ఆదివాసీ స్వాతంత్రయోధుడు కొమరం భీమ్ గారు..
✊🏻 కొమరం భీమ్ – ఆదివాసీ యోధుడి గాధ

🧒 జననం:
- 1901 సంవత్సరంలో, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ మండలంలోని శంకేపల్లి (జిన్నూరు అడవి) గ్రామంలో గోండ్ తెగకు చెందిన కుటుంబంలో జన్మించారు.
🌿 వారి నేపథ్యం:
- కొమరం భీమ్ గారు గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు.
- ఆ సమయంలో నిజాం పాలనలో గిరిజనులకు భూమిపై హక్కులు లేకుండా ఉండేవి.
- దళారులు, అడవీ అధికారులు ఆదివాసీలను దుర్భరంగా వేధించేవారు.
📢 “జల్, జంగల్, జమీన్” అనే నినాదం:
- ఆయన ఇచ్చిన నినాదం:
“జల్, జంగల్, జమీన్” (నీరు, అడవి, భూమి మా జీవనాధారం). - ఇది ఆదివాసీ హక్కుల పోరాటానికి ప్రతీకగా నిలిచింది.
⚔️ పోరాటం:
- నిజాం ప్రభుత్వం ఆదేశించిన పన్నులు, నిబంధనలు మరియు అన్యాయాలను వ్యతిరేకించారు.
- దాదాపు 10 సంవత్సరాల పాటు అరణ్యంలోనే నివసించి, గిరిజనులను చైతన్యపరిచి, సాయుధ పోరాటానికి సిద్ధం చేశారు.
🩸 వీర మరణం:
- 1940 అక్టోబర్ 27న, జంగల్లోని జోదంగఠ్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన ఎదురు యుద్ధంలో వీర మరణం పొందారు.
🏞️ వారసత్వం:
- ఆయన స్మారకంగా తెలంగాణ ప్రభుత్వం కొమరం భీమ్ జిల్లా ని ఏర్పాటు చేసింది.
- ఆదివాసీల మానవ హక్కుల చట్టాలను ప్రేరేపించిన నేత.. భీమ్
📸 కొమరం భీమ్ గారి జీవితం ముఖ్యాంశాలు
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 – 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకులు.. కొమురం భీమ్ గారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నా ఆదిలాబాద్ అడవుల లో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించారు.
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి.. వారి విముక్తి కోసం ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూరు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారారు…
కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా “గొరిల్లా” శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి 1940 అక్టోబరు 27 నాడు వీరమరణం పొందారు
నేటి పాట-ఏ దేశమేగినా ఎందుకాలిడినా
రచన : రాయప్రోలు సుబ్బారావు గారు