నేటి పంచాంగం, నేటి విశిష్ఠత – కోరల పౌర్ణమి
ది. 𝟏5-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం
డిసెంబరు 15, శుక్రవారం 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం
తిథి : పూర్ణిమ మ2.37 వరకు
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : మృగశిర తె3.28 వరకు
యోగం : శుభం తె3.43 వరకు
కరణం : బవ మ2.37 వరకు తదుపరి బాలువ రా1.56 వరకు
వర్జ్యం : ఉ9.43 – 11.16
దుర్ముహూర్తము : సా3.56 – 4.40
అమృతకాలం : సా6.59 – 8.31
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం : సా4.30 – 6.00
సూర్యరాశి: వృశ్చికం || చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 6.26 || సూర్యాస్తమయం: 5.24
🙏లోకాః సమస్తాః🙏
💐సుఖినోభవంతు💐
ఈరోజు రాశి ఫలాలు
మేషం రాశి
దైవబలం రక్షిస్తోంది. మీ మీ రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో ప్రతిభతో కూడిన విజయం లభిస్తుంది. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. ఒత్తిళ్లను అధిగమిస్తారు. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. విష్ణుధ్యానం మంచిది
వృషభ రాశి
ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
మిథున రాశి
వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.
కర్కాటకం రాశి
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లభిస్తుంది.
సింహం రాశి
వృత్తి వ్యాపారాలలో అది కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.
కన్య రాశి
ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. స్ధిరాస్తి సంభందిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
తుల రాశి
ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలుతొలగుతాయి. చిన్ననాటి మిత్రులకు శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటా. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
వృశ్చికం రాశి
ప్రారంభించిన పనులు దైవబలంతో పూర్తవుతాయి. సప్తమంలో చంద్రబలం విశేషమైన మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తోంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ఆర్థిక సహకారం సమకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
ధనుస్సు రాశి
శుభకాలం. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.
మకరం రాశి
దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్దులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.
కుంభం రాశి
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి ప్రగతిని సాధిస్తారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. చంద్ర శ్లోకం చదవాలి.
మీన రాశి
ఆత్మీయ్యుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
🚩నేటి విశిష్ఠత – కోరల పౌర్ణమి🚩
కోరల పౌర్ణమి:
మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో రేపు వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.
ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు.
రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.
చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.
కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు , అపమృత్యు భయాలు తొలగిపోతాయి.ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి