REMEMBERING TELUGU FREEDOM FIGHTRERS DAY-3

🛑REMEMBERING TELUGU GFREEDOM FIGHTRERS DAY-3🛑

తొలి స్వాతంత్రయోధ్యమం మొదలు పెట్టిన ధీరుడు

THE GREAT INDIAN FREEDOM FIGHTER.. SRI UYYALAWADA NARASIMHAA REDDY

ఆగస్టు1 నుండి 15వరకు రోజుకొక తెలుగు నాయకులను స్మరించుకుంటూ..

నేటి నాయకులు..
“తొలి స్వరాజ్య సమరయోధులు- ఉయ్యాలవాడ “

🙏🏻ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు🙏🏻

  • పూర్తి పేరు: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
  • జననం: 1806- రూపనగుడి, ఆంధ్రప్రదేశ్
  • వీర మరణం: 1847
  • ప్రముఖ తొలి తెలుగు జాతీయ నాయకులు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – తొలి తిరుగుబాటు నాయ‌కుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – తొలి తిరుగుబాటు నాయ‌కుడు

1857 నాటి భారత స్వాతంత్రయోధ్యమానికి ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందారు..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు భారత స్వాతంత్రయోధ్యమ పోరాట చరిత్రలో తొలి తిరుగుబాటు యోధుడిగా గుర్తింపు పొందారు. ఆయన 1806లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని రూపనగుడి అనే గ్రామంలో జన్మించారు. పాలెగాడు వంశానికి చెందిన నరసింహారెడ్డి, చిన్ననాటి నుంచే ధైర్యవంతుడు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగిన నాయకుడిగా పేరొందారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై విధించిన దమనకర పన్నులు, అన్యాయాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఆయన ప్రజల కోసం గళమెత్తారు.

1846లో నరసింహారెడ్డి గారు సుమారు 5000 ఐదువేల మంది రైతులతో కలిసి బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ కస్టడీ పన్నులను తిరస్కరించడంతో పాటు, వారి కార్యాలయాలపై దాడులు చేసి, ధనాన్ని దోచి ప్రజలకు పంచిపెట్టారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ పాలకులు తీవ్రంగా అభద్రతగా భావించారు. ఆయనపై పట్టుబడి బహిరంగంగా ఉరి శిక్ష విధించారు. 1847, నవంబర్ 22న కోయిలకుంట్ల వద్ద ఆయనను ఉరితీశారు. వారి తలను భారతీయుల ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని భయపెట్టేందుకు సంవత్సరాలపాటు అలా ఉరి కంబానికి వేలాడదీస్తూనే ఉంచారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మొట్టమొదటి ఉరితీర్పు. ఆయన మరణంతో స్వాతంత్రయోధ్యమ పోరాటం అణగిపోలేదు, ప్రజలలో దేశభక్తిని పెంపొందించింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ధైర్యం, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఓ వెలుగు వున్న దీపంలా మెరుస్తూ ఉంటారు. ఆయన కథని మనం తరతరాలుగా చెబుతూ, స్ఫూర్తిగా తీసుకోవాలి.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻



ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పాట

  • దొరవారి నరసింహ్వ రెడ్డి!
    నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర ||
    రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
    దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర ||
    కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
    గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
    కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
    పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || (పారాతో = పహరా తో)
    కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
    నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
    కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
    కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర ||
  • (ఆ సమయంలో నరసింహారెడ్డి తల్లి కాశీలో ఉన్నట్లు చెబుతారు)

సైరా నరసింహారెడ్డి తెలుగు చలనచిత్రం


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ వారి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మించబడింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.


“తలయెత్తి జై కొట్టు తెలుగోడా…”


🛑TODAY”S SONG-జయ జయ జయ ప్రియ భారత..🛑

రచన – దేవులపల్లి వారు

COURTESY: THIS SONG IS AVAILABLE IN YT. COMPOSED BY MAESTRO ILAYARAJA GARU.. THMQ

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

Leave a Comment