మీరు ఎప్పుడైనా భూమి తిరగడాన్ని చూసారా..?
విద్యార్థుల కోరిక మేరకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త Dorje Angchuk చేసిన వినూత్న రికార్డింగ్..
మీకోసం..
✅ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం, భూపరిభ్రమణం అంటారు. అయితే, ఇవి మన కంటికి కనిపించవు.
ఇది భూమి కి వెలుపల అంతరిక్షంలో నుండి, సాటిలైట్ కెమెరాల ద్వారా చూడొచ్చు..
కానీ దాన్ని ఉపరితల నుండి వినూత్న సాంకేతికత ఆధారంగా కెమెరాలో బంధించారు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ (Dorje Angchuk).
భూ భ్రమణం గురించి విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకునేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అంగ్‌చుక్ పేర్కొన్నారు.
వారు భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీడియో తీసారు.
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లడఖ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల నుండి భూమి యొక్క భ్రమణాన్ని చూపించే అద్భుతమైన టైమ్-లాప్స్ వీడియోను తీసారు.. దీన్ని అనేకమంది వీక్షించారు.. అభినందిస్తున్నారు..
(Indian astronomer Dorje Angchuk has captured a stunning time-lapse video showing the Earth’s rotation from the serene landscapes of Ladakh.)
లడఖ్‌లో (Ladakh) భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో (Timelaps) ఆయన బంధించారు.
హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IIA) ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా అంగ్‌చుక్ పనిచేస్తున్నారు. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి ఆయన ఈ వీడియో తీసారు.
ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా మార్చిన ఆయన.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మీరు కూడా ఒక లుక్ వేసేయండి..
ఈ వీడియోలో భూమి ఏలా తిరుగుతుందో అంటే భూభ్రమణం స్పష్టంగా కనిపిస్తోంది.
శాస్త్రవేత్త అంగ్‌చుక్ మాట్లాడుతూ.. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని తెలిపారు. దీనిని వీడియోలో బంధించడానికి తాను చాలా ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. ఇది నా ఓర్పు, సహనాన్ని పరీక్షించిందని ఆయన చెప్పారు. ‘‘మొదట్లో ఓరియన్‌ను ఫ్రేమ్‌లో బంధించాలని భావించాను… కానీ అది ఆకాశంలో 4 అక్షాంశాల ఎత్తులో ఉంది… లడఖ్‌లో విపరీతమైన శీతల వాతావరణం మరింత కఠినతరం చేసింది.. బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోయింది…’’ అని తెలిపారు.
‘కెమెరా స్టోరేజ్, బ్యాటరీ వైఫల్యం, టైమర్ పనిచేయకపోవడం వంటి అనేక సవాళ్లతో నాలుగు రాత్రుల పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను.. ప్రతి సందర్భంలోనూ నా ప్రాజెక్ట్‌కు అవాంతరం ఏర్పడింది.. ఒకదశలో విరమించుకోవాలని నిర్ణయానికి వచ్చాను కూడా.. భ్రమణం, మొబైల్ సెటప్‌ను మార్గనిర్దేశం చేసే ట్రాకర్‌తో ప్రతికూలతను అధిగమించి చివరకు సజావుగా దీనిని సంగ్రహించాను… అయినప్పటికీ, పోస్ట్‌ప్రాసెసింగ్ సవాళ్ల తప్పలేదు.. ఫ్రేమింగ్‌లో వ్యత్యాసం కారణంగా క్రాప్ చేయాల్సి వచ్చింది.. చివరికి ఆ ప్రయత్నం విజయవంతమైంది’ అని చెప్పారు.
భూ భ్రమణం గురించి విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకునేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అంగ్‌చుక్ పేర్కొన్నారు. లడఖ్‌లోని విపరీతమైన శీతల వాతావరణం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పని చేయకపోవడం వంటివి ఎదుర్కొన్నా…. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లానని ఆయన అన్నారు. లడఖ్‌లో అతి శీతల వాతావరణం వల్ల కెమెరాలు, బ్యాటరీలు కూడా పనిచేయడానికి మొరాయించాయని అంగ్‌చుక్ తెలిపారు. కానీ, ఈ సవాల్‌ను అధిగమించాలని నిర్ణయించుకుని పట్టుదలతో వెళ్లడంతో సాధ్యమైందని ఆయన వివరించారు.
ఇక, సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆయన పనికి ఫిదా అవుతున్నారు.
మీరూ చూడండి.. click here to watch
Video attached here ..
Video courtesy- Dodje Angchuk
SHare this post to all..