ఉగాది 2024 – UGADI 2024

ఉగాది 2024 – UGADI 2024

◆2024 ఏప్రిల్ 9వ తేదీ చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు

 

 

ఈ క్రోధి నామ సంవత్సరం అర్థం ఏంటి?

UGADI-2024
VIGNANA KOUMUDI

ఈ క్రోధి నామ సంవత్సరం అర్థం ఏంటి?

◆శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని సిద్ధాంతులు అంటున్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపము, ఆవేశముతో వ్యవహరిస్తారట.

◆కుటుంబసభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు, క్రోధములు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికముగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

👉🏻తెలుగు సంవత్సరాలు ఎన్ని? శ్రీ క్రోధి ఎన్నవది ?

మొత్తం 60 సంవత్సరాలు.
క్రోధి నామ సంవత్సరం 38 వది.

👉ఉగాది అంటే ఏంటి?

“ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్ధాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడ అర్ధం.

“ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం” (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరాది…ఉగాది.

వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః.. సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృ స్వరూపం.

నేటి నుంచే, అనగా ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతఃకాలమున లేచి ఇళ్లు, వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు.

ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానంచేసి, కొత్తబట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది.

 

👉ఉగాది పచ్చడి విశిష్టత

షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. మరియు…

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు.

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు.

ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు.

 

👉🏻ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం:

ఉగాది ప్రసాద ప్రాశన శ్లోకం –

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |

సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం |

అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

అందరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీ విజ్ఞాన కౌముది

Related Posts

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత గీతాజయంతి

టి విశిష్ఠత గీతాజయంతి ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకు ద్వాపర యుగం…

One thought on “ఉగాది 2024 – UGADI 2024

  1. ఉగాది పండుగ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEW THINGS

January 2nd specialty

January 2nd specialty

JANUARY SPECIAL DAYS

JANUARY SPECIAL DAYS

Motivational Monday

Motivational Monday

నేటి  పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 18-12-2024.. సంకష్టహర చవితి

నేటి  పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 18-12-2024.. సంకష్టహర చవితి

నేటి పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 16-12-2024

నేటి  పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 16-12-2024

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత- కోరల పౌర్ణమి, ఈరోజు రాశి ఫలాలు 15-12-2024

నేటి  పంచాంగం, నేటి విశిష్ఠత- కోరల పౌర్ణమి, ఈరోజు రాశి ఫలాలు 15-12-2024