నేటి పంచాంగం, నేటి విశిష్ఠత – దత్తాత్రేయ జయంతి
ది. 𝟏4-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం
డిసెంబరు 14, శుక్రవారం 2024
హనుమద్వ్రతం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం
తిథి : చతుర్దశి సా4.19 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : రోహిణి తె4.19 వరకు
యోగం : సిద్ధం ఉ8.45 వరకు తదుపరి సాధ్యం తె.6.07 వరకు
కరణం : వణిజ సా4.19 వరకు తదుపరి విష్ఠి తె3.27 వరకు
వర్జ్యం : రా8.42 – 9.13
దుర్ముహూర్తము : ఉ6.25 – 7.52
అమృతకాలం : రా1.16 – 2.47
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00
సూర్యరాశి: వృశ్చికం || చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 6.25 || సూర్యాస్తమయం: 5.24
🙏లోకాః సమస్తాః🙏
💐సుఖినోభవంతు💐
ఈరోజు రాశి ఫలాలు
మేషం రాశి
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివ స్తోత్రం చదివితే మంచిది.
వృషభ రాశి
సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.
మిథున రాశి
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాల అనుకూలిస్తాయి.
కర్కాటకం రాశి
కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి.
సింహం రాశి
కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కన్య రాశి
నూతన మిత్రుల పరిచయాలు లాభం సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.
తుల రాశి
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం రాశి
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. శని శ్లోకం చదవండి.
మకరం రాశి
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మికధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభం రాశి
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.
మీన రాశి
చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
🚩నేటి విశిష్ఠత – దత్తాత్రేయ జయంతి🚩
శ్రీ దత్తాత్రేయ జయంతి నిర్ణయం:
మార్గశిర శుక్ల చతుర్దశి ప్రదోషకాల వ్యాప్తి ఉన్న రోజున శ్రీ దత్తాత్రేయ అవతారం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రకారం ఈరోజు(14-12-24) ప్రదోష సమయంలో శాస్త్రీయమైన “శ్రీ దత్త జయంతి” జరుపుకోవాలి.కానీ లౌకికంగా మార్గశిర పౌర్ణమి రోజు (15-12-2024) జరుపుకోవడం ఆచారంగా ఉంది. కాబట్టి ఈరోజు,రేపు శ్రీ దత్త కృపను పొందడానికి అద్భుతమైన రోజులు. జై గురుదేవ దత్త.
శ్రీ దత్తాత్రేయ మంత్రం
దత్తాత్రేయ హరే కృష్ణా ఉన్మత్తానంద దాయకా||
దిగంబర మునే బాల పిశాచ జ్ఞాన సాగరా||
🔔 అవతరణం🔔
🌿 🌹శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం.🌹
🌸గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు.
🌿ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
🔔 అవతరణం🔔
🌸అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు.
🌿ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది.
🌸ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు.
ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి
🌹శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి🌹
🌿ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు.
🌸ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?
🌿ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు.
🌸త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు.
🌿వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది, వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని ఏమిటో? అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి.
🌿వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్నామృతంగా వినిపిస్తున్నాయి.
🌿ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం నుగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో లలిసి ఆడుకుంతే! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు.
🌸అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం మాటాను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం; అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
🌿మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, ముని శ్రేష్ఠౌడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన “పతి సేవతత్ పరతచే” పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ; పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లిని, దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి, అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ, విష్ణు, మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు.
🌸భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో…. చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు.
🌿వరి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన “భర్త”ను మనసారా నమస్కరించుకుంది. “పాతివ్రత్యజ్యోతి” వెలిగింది. ఆమెజ్ఞానాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు ఐంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది.
🌿పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా; అని ఆలోచిస్తూ!
ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి “ఓం శ్రీపతి దేవయనమః” అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాత్ర్త్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ౠషిబాలురు కలిసి మెత్తన్ పూల పాంపుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది.
🌸”ఇ “ఇంతటి మహద్భాగ్యం” సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి….! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్ట్రుపడి మరలాతేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు “ఈ ఆశ్రమ ప్రవేశ సమయమందే” ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే! కార్యరూపందాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ గెంతుతూ అ ముని బాలకులతో, కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.
🌿ఇలా ఉండగా! లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన “ఈర్ష అసూయ – ద్వేషాలు” పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది!
🌿 అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి, స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని “ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!” మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు.
🌿అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టరు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి, మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము.మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డాలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను “దత్తనారాయణు”నికి ఇచ్చినారు.
అప్పటి నుండి ఆ స్వామివారు “శ్రీ దత్తాత్రేయ” స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.
ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన “శ్రీదత్తజయంతి”నాడు ఆ స్వామికి షోడషోపచార ములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు….స్వస్తి…