WELCOME TO  DAY-1 TET TELUGU 30M

ALL THE BEST

(1-6) సూచన:- క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.

తనయుడుఁగాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం

 దనవనమందుఁ గంటకయుత క్షితిజాతము భంగిఁ బుట్టి నాఁ

 డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి సెయుచుండు దం

 డనమునగాఁని శిక్షలకు డాయఁడు పట్టుడు కొట్టుడుద్ధతిన్

Deselect Answer

1. 'తనయుడు' - పదానికి అర్ధం.
2. 'దైత్య వందనవనమందుఁ గంటకయుత క్షితిజాతము భంగి' ఈ వాక్యములోని అలంకారము...
3. 'కులాంతకుడు' - పదములోని సంధి
4. ఈ పద్య పాద గణాలు
5. ఈ పద్యంలో 'దానవభర్త' అను పదం ఎవరిని సూచిస్తుంది.
6. దానవ కులాంతకుడు ఎవడు..?
(7-12) సూచన:- క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైనా నదియు కొదువ కాదు

విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత!

విశ్వదాభిరామ! వినుర వేమ!

Deselect Answer

7. వేమన పద్యాల ప్రధాన అంశం ఏమిటి?
8. *'చిత్తశుద్ధి' గురించి వేమన తన పద్యంలో ఏమి చెప్పాడు?
9. వేమన పద్యాల చివర వచ్చే పదం “వినుర వేమ” అనునది______
10. వేమన కవిత్వంలో కింది వాటిలో ఏది లక్షణం కాదు?
11. వేమన తన పద్యంలో విత్తనానికి ఏదిని పోల్చారు?
12. వేమన కాలం__________శతాబ్దం.
(13-18) సూచన:- క్రింది గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.

గంగా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది. ఈ నది హిమాలయ పర్వతాలలోని గంగోత్రి హిమానీనదం నుండి ఉద్భవిస్తుంది. గంగా నది భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లలో 2,525 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. హిందూమతంలో గంగా నది పవిత్రతకు అత్యున్నత స్థానం ఉంది. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, గంగాజలం తాగితే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం. గంగానది ఒడ్డున ఉన్న వారాణసి, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. గంగానది కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, దానిని శుద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అందులో  భాగంగా 2014 లో “నమామి గంగే” పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.

Deselect Answer

13. గంగా నది ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది?
14. *గంగా నది మొత్తం పొడవు ఎంత?
15. హిందూమతంలో గంగా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
16. గంగానది కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి ఏ కార్యక్రమం చేపట్టబడింది?
17. గంగానది ఏ రెండు దేశాలలో ప్రవహిస్తుంది?
18. గంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది?
(19-24) సూచన:- క్రింది గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.

భారతదేశంలో పులులను రక్షించడం అత్యంత ముఖ్యమైన పని. పులులు (పాంథెరా టైగ్రిస్) మన పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటాయి మరియు ఇతర జంతువుల జనాభాను నియంత్రిస్తాయి. పులుల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పులులను రక్షించడం ద్వారా మన అడవులను, నీటి వనరులను మరియు పర్యావరణ సేవలను కాపాడుకోవచ్చు. పులుల రక్షణ కోసం ప్రభుత్వం మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. పులుల సంరక్షణ కోసం 'ప్రాజెక్ట్ టైగర్' వంటి పథకాలు ప్రారంభించబడ్డాయి. మనం పులులను రక్షించడం ద్వారా మన పర్యావరణాన్ని మరియు మన భవిష్యత్తును కాపాడుకోవచ్చు.Deselect Answer

19. పులులు ఏ కుటుంబానికి చెందినవి?
20. పులులు ఆహార గొలుసులో ఏ స్థానంలో ఉంటాయి?
21. పులుల రక్షణ కోసం ప్రారంభించబడిన పథకం పేరు ఏమిటి?
22. పులులను రక్షించడం ద్వారా మనం ఏమి కాపాడుకోవచ్చు?
23. పులులు ఏ ప్రజాతిలో భాగం?
24. పులుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏమి జరుగుతుంది?
25. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. అన్నది ఎవరు?
26. బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తే భాష. అని ఎవరు నిర్వచించారు?
27. ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏది?
28. భాషోత్పత్తిలో సంకేతవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
29. ఆదిమానవుడు తన పరిసరాలలో ఉన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నేర్చుకుంటాడు అని తెలిపే వాదం ఏది?
30. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషావిభజనానికి యత్నించారు వీరి విభజన ప్రకారం తెలుగు పంచస్వరభాష అనడానికి మూలం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *