కార్మికుల దినోత్సవం – మే 01 – మే డే
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
కామ్రేడ్స్… ప్మేరపంచ కార్మిక-కర్షక సోదరులకు.. డే శుభాకాంక్షలు

🛑 MAY DAY ఉద్దేశ్యం :
Labor Day is a day to protest against the tyrannical exploitation of labor… to inspire workers around the world… to confront industrialists…
✊🏼 నిరంకుశ శ్రమదోపిడీని నిరసిస్తూ… యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ… పారిశ్రామిక వేత్తలను నిలదీస్తూ… వేసిన ముందడుగే కార్మిక దినోత్సవం.
✊🏼 ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే. మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరి మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేేేసిన పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (May Day/ International Workers’ Day/ Workers’ Day/ Labour Day) ముఖ్య ఉద్దేశ్యం.
🛑HISTORY OF MAY DAY
✊🏼1837 లోనే ఇంగ్లాండ్ లోని ఫిలడల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ నాయకత్వాన 10 గంటల పని దినం కోసం తొలి సమ్మె జరిగింది.
✊🏼1834 లో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన ఉద్యమం పలు పట్టణాలకు వ్యాపించి పెద్ద ఎత్తున జరిగిన ప్రదర్శనలలో, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
✊🏼 1866 లో అమెరికాలోని బార్డిమోర్ లో 60 కార్మిక సంఘాల ప్రతినిధులు “నేషనల్ లేబర్ యూనియన్” పేరుతో ఒక కార్మిక సంఘాన్ని స్థాపించి విలియం హెచ్.సెల్విన్ నాయకత్వాన లండన్ లోని ఫస్ట్ ఇంటర్ నేషనల్ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకుని 8 గంటల పని విధానం కోసం ఉద్యమించారు.
✊🏼1886 లో అమెరికా నగరాలైనా చికాగో, న్యూయార్క్, బాల్డిమోర్, వాషింగ్టన్, విల్ వాకి, సిన్సినాటి, సెయింట్ లూయీస్, ఫిట్స్ బర్గ్, డెట్రాయిట్ వంటి నగరాలలో 11,562 సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో 5 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు.
✊🏼చికాగో(Chicago) నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
✊🏼అమేరికా దేశవ్యాప్తంగా 13,000 సంస్థలలో 3 లక్షల మంది కార్మికులు సమ్మెలలో పాల్గొంటే, ఒక్క చికాగో నగరంలోనే 40 వేల మంది కార్మికులు సమ్మె చేశారు.
✊🏼1886 మే 3 వ తేది చికాగో నగరంలో లక్ష మంది కార్మికులు చేసిన సమ్మెలో పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
✊🏼దీనికి నిరసనగా మే 4 వ తేది చికాగోలోని హే మార్కేట్ (Hey Market) సెంటర్ లో జరిగిన ప్రదర్శనల్లో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
✊🏼ఈ ప్రదర్శనల్లో అనేక మంది కార్మికులు చనిపోవడం, గాయాలపాలవడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
✊🏼 ఉద్రిక్తులైన కార్మికులను సముదాయించేందుకు అధికారుల బృందం ప్రయత్నిస్తూంటే, యాజమాన్యం ప్రోద్భలంతో గుర్తు తెలియని వ్యక్తి ప్రయోగించిన బాంబు పేలుడులో 7 గురు పోలీసులు, 8 మంది పౌరులు మరణించారు.
✊🏼 దీనితో హే మార్కేట్ (Hey Market) ప్రాంతం రక్తసిక్తమై వందలాది మంది కార్మికుల రక్తంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
✊🏼చికాగో ఘటనలపై విచారించిన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగ, 8 మంది కార్మిక నాయకులను బాధ్యులుగా గుర్తించీ, విచారణ నిర్వహించి 7 గురికి మరణ శిక్ష విధించింది. ఒకరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (ఇందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.నలుగురిన ఉరితీశారు. మిగిలిన ముగ్గురు 6 సంవత్సరాల తర్వాత క్షమించబడ్డారు)
✊🏼 పని గంటల తగ్గింపు కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఎర్ర జెండాగా ప్రపంచమంతా కార్మిక వర్గ ఉద్యమం పెల్లుబికింది.
✊🏼 శ్రామిక వర్గం ఎర్ర జెండాను తమ పోరాట సంకేతంగా స్వీకరించింది.
🛑సాధించినవి:
✊🏼24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు మానసిక విశ్రాంతి (Recreation) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు.