REMEMBERING TELUGU FREEDOM FIGHTRERS DAY-2

🛑REMEMBERING TELUGU GFREEDOM FIGHTRERS DAY-2 🛑

PINGALI VENKAYYA GARU THE GREAT

జెండా తాత-పింగళి వెంకయ్య గారు..

AUGUST 15.. NATIONAL FLAG CREATOR

ఆగస్టు1 నుండి 15వరకు రోజుకొక తెలుగు నాయకులను స్మరించుకుంటూ..

నేటి నాయకులు..
“జెండా తాత” – జాతీయ పతాక రూపశిల్పి..

🙏🏻పింగళి వెంకయ్య గారు🙏🏻

  • శ్రీ పింగళి వెంకయ్య గారు –జాతీయ జెండా రూపకర్త
  • పూర్తి పేరు: పింగళి వెంకయ్య గారు
  • జననం: ఆగస్టు 2, 1876 – బాపట్ల, ఆంధ్రప్రదేశ్
  • మరణం: జూలై 4, 1963
  • ప్రముఖ జాతీయ నాయకులు

జాతీయ పతకాన్ని ఎగరవేసేప్పుడు గర్వంగా ఉంటుంది.. ఆ పతకాన్ని ఇచ్చింది మన తెలుగు తాతే అని.. ఒక తెలుగు విద్యార్ధి..

పింగళి గారు 1878 ఆగస్టు 2న కృష్ణాజిల్లా జన్మించారు. తన 19వ ఏట సైన్యంలో చేరి ఆఫ్రికా వెళ్ళారు. అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాల్లో విద్యనభ్యసించారు. బళ్లారి ప్లేగు వ్యాధి ఇన్స్పెక్టర్గాను, చెన్నైలో రైల్వే గార్డుగాను పనిచేసినా తృప్తి పడని వెంకయ్య దేశంకోసం, స్వాతంత్య్రం కోసం ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు. జపాన్, సంస్కృతం, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు పెంచుకు న్నారు. వీరి నాయకత్వ పటిమను చూసిన మునగాల జమీందారు నాయని రంగారావు వీరిని తన సంస్థానానికి తీసుకెళ్ళి వ్యవసాయ పరిశోధనలు చేయించారు.

1916లో “మన జాతీయ పతాకం” అనే గ్రంథాన్ని ప్రచురించారు. 1921లో కాంగ్రెస్ కమిటి సమావేశాలు విజయవాడలో జరిగినప్పుడు త్రివర్ణ పతాకాన్ని చిత్రించి గాంధీజీకి ఇవ్వగా, అది జాతీయ పతాకంగా రూపుదాల్చింది. అందులో మధ్యలో రాట్నం ఉండేది. భారత రాజ్యాంగసభలో రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని ఉంచింది.

అలా వీరు రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయపతాకమైంది. 1963 జూలై 4న దివంగతులైనా వీరు జాతీయజెండా రెపరెపల్లో ప్రజలు గౌరవించు కుంటున్నారు.

మనం ముద్దుగా జెండా తాత గా పిలుచుకుంటున్నాం..

అలా దేశ స్వరాజ్య ఉద్యమంలో తెలుగువాడిగా.. దేశానికే జెండా ను ఇచ్చారు .. వారికి నివాళి అర్పిస్తూ..

జోహార్ పింగళి వెంకయ్య గారు..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻




“తలయెత్తి జై కొట్టు తెలుగోడా…”


🛑TODAY”S SONG-ఎగారలోయ్… ఎగరాలి..🛑

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

Leave a Comment