ఏప్రిల్ 1st ఫూల్ ఎందుకయ్యయింది..
ఏప్రిల్-1
నేడు అంతర్జాతీయ ఫూల్స్ డే
April 1st
ఫూల్స్ డే ఏప్రిల్ 01

ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీన ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ పాటిస్తారు.
దీన్ని ‘ఆల్ ఫూల్స్ డే’ అని కూడా వ్యవహరిస్తారు. ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ దినం, మనదేశంలో కూడా ఉనికిలో ఉంది. అనుభవంలోకి వచ్చేలా హాస్యం, తమాషాలు, గమ్మత్తుపనులు చేయడం ద్వారా దీన్ని ఆస్వాదిస్తారు.
ఆయా అంశాలు అనుభవంలోకి వచ్చినప్పుడు వాటికి బలైనవారిని ‘ఏప్రిల్ ఫూల్’ అంటారు.
కొన్ని వార్తాపత్రికల్లో, టెలివిజన్ చానళ్ళలో అందరికీ దిగ్భ్రాంతి కలిగించే అంశాలో, నమ్మశక్యంగాని విషయాలనో కథనాలుగా ఇచ్చి, వీక్షకులు ఆ భ్రమ నుంచి తేరుకునే లోపు అది ఏప్రిల్ ఫూల్ చమత్కారమంటూ ముక్తాయిస్తుంటాయి.
ఐరోపాలో ‘గ్రెగోరియన్ కేలండర్’ 1582 అక్టోబర్ 4వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సర దినంగా వచ్చింది. అంతకుముందు వరకు ఫ్రాన్స్లో కొత్త సంవత్సర వారోత్సవాలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసేవి. కొత్త కేలండర్లో జనవరి 1వ తేదీ కొత్త సంవత్సర ప్రారంభ తేదీగా వచ్చినా ఇంకా కొందరు పాత ధోరణిలో ఏప్రిల్ 1 వరకు కొత్త సంవత్సర సంబరాలు చేస్తుండేవారు. అలాంటి వారిని ఫూల్స్ అంటూ – ఏప్రిల్ ఫూల్స్ డే వచ్చిందనేది ఒక కథనం.


INDIA POSTAL SAVINGS STARTED TODAY
పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ప్రారంభం బ్రిటన్లో పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ వ్యవస్థ విజయవంతం కావడంతో భారతదేశంలో కూడా వాటిని ప్రారంభించాలనే ఆలోచన 1860లో ఆంగ్ల పాలకులు చేశారు. 1873లో ప్రభుత్వ సేవింగ్స్ బ్యాంక్ చట్టం అమలులోకి వచ్చింది. 1881లో దేశంలో సేవింగ్స్ బ్యాంక్ వ్యవస్థ ప్రారంభించేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదం పొందలేదు. చివరకు ప్రభుత్వం వారు 1882 ఏప్రిల్ 1వ తేదీన బాంబే ప్రెసిడెన్సీ మినహాయించి దేశమంతటా పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ప్రారంభించారు. దాంతో గ్రామీణ ప్రజలకు కూడా పొదుపు చేసేందుకు అవకాశం వచ్చింది. ఈనాటికి 1.5 లక్షల పోస్టాఫీసుల్లో సేవింగ్స్ బ్యాంక్ సౌకర్యం ఉంది.
