STOP FGM

 What is FGM?

Content Warning: This article contains descriptions of abuse and mutilation.

ఫిబ్రవరి 06

అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియ ఛేదన సంపూర్ణ స్వస్తి దినం


Female genital mutilation (FGM)

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో యుక్తవయసులోకి వస్తున్న ఆడపిల్లల జననేంద్రియాలను కత్తిరించడం తరతరాలుగా సాగుతోంది. ఈ అమాననీయ దురాచారం ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంది. మనదేశంలో కూడా ఇది కొన్ని తెగలలో, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలికల జననాంగాలను కొద్దిగాగాని, పూర్తిగా గాని ఎటువంటి వైద్య కారణం లేకుండా కత్తిరించడం సంప్రదాయాల పేరిట సాగుతోంది. మనదేశంలో ఈ ఆచారం రహస్యంగా కొనసాగుతోంది. కుటుంబ గౌరవం, పురుషునికి సంభోగ తృప్తి పెరగటం, సంతాన సాఫల్యత పెరగటం అనే కారణాలతో సమాజం ఆమోదిస్తోందని ఈ ఆచారం పాటించేవారు భావిస్తారు..

STOP FGM
STOP FGM

ఈ దురాచారంతో బాధపడే యువతులు – యవ్వనంలో వచ్చే బహిష్టులానే ఇది కూడా ఒక తప్పనిసరి అంశమని భావించడం, సిగ్గు, భయం వల్ల ఎవరూ ఈ స్త్రీ అణచివేత చర్యల గురించి వ్యతిరేకించటం లేదు. ఈ దురాచారం వల్ల గర్భకోశ, యోని, కటి సంబంధ వ్యాధులు బాల్యంలోను, గర్భధారణలో, ప్రసవంలో సమస్యలు, జననాంగాలు సరిగా పనిచేయక బహిష్టు సమయంలో ఇబ్బందులు, మానసిక కుంగుబాటు వంటివి ఎదురవుతాయి. ఈ అమాననీయ ఆచారానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని, దీని గురించి సమాజం, వైద్యులు, మత పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు దృష్టిపెట్టి దీనిని నిరోధానికి ప్రచారం చేయాలని ఐక్యరాజ్య సమితి 2012 డిసెంబర్ 20న తీర్మానించింది.

STOP FGM

అందుకోసం ఫిబ్రవరి 6వ తేదీన అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియాల ఛేదన సంపూర్ణ స్వస్తి దినం జరపాలని పేర్కొంది.

 

2013 నుంచి నిర్వహిస్తున్న ఈ దినం సందర్భంగా బాలికల మానవహక్కులను కాపాడి, వారి ఆరోగ్య సంరక్షణకు అందరూ ముందుకు రావాలి.

 

2030 నాటికి ఇది పూర్తిగా అంతరించిపోవలనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది.

 

ప్రపంచవ్యాప్తంగా రోజుకి సుమారు 12000 కేసులు ఈ FGM క్రింద నమోడవుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరమో అర్థమవుతోంది..

దీన్ని పూర్తిగా నిర్మూలించేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యేటా ఫిబ్రవరి 6ను ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్జీఎం’గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. స్త్రీ జననేంద్రియ వైకల్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.

 

“యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః”

జైహింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *