టి విశిష్ఠత గీతాజయంతి
ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?
గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!
యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు.
భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు. కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా “మహా ప్రస్థానము” గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!
మహాభారత యుధ్ధము “కురుక్షేత్రము”లో 18రోజులుజరిగింది!!
కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం
ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం
చేసి పదవరోజున నేలకొరిగాడు!!
11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా మొదటి సారి హస్తినాపురములోని సభలో వున్నవారందరూ ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!
కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన
కురు – పాండవ సేనావాహినుల మధ్యన రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో
విషాదముతో బాధపడుతున్న అర్జునుని నిమిత్త మాత్రునిగా చేసుకుని శ్రీకృష్ణుడు భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!
లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు “గీతాజయంతి” ని జరుపుకుంటాం!!
మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం జరుపు కుంటున్నాము.
జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అద్భుతమైన విషయం!!
లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే “భగవద్గీత”!!
కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు
గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5161 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5161 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!