నేటి పంచాంగం, రాశి ఫలాలు,ధనుర్మాసం ప్రారంభం
ది. 𝟏6-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం
డిసెంబరు 16, సోమవారం 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం
తిథి : పాడ్యమి మ1.15 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఆర్ద్ర తె3.00 వరకు
యోగం : శుక్లం రా1.36 వరకు
కరణం : కౌలువ మ1.15 వరకు తదుపరి తైతుల రా12.48 వరకు
వర్జ్యం : ఉ11.42 – 1.16
దుర్ముహూర్తము : మ12.16 – 1.00 మరల మ2.28 – 3.12
అమృతకాలం : సా5.12 – 6.46
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి: వృశ్చికం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 6.26 || సూర్యాస్తమయం: 5.24
👉 ధనుస్సంక్రమణం ఉ6.57 గం.లకు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
🙏లోకాః సమస్తాః🙏
💐సుఖినోభవంతు💐
ఈరోజు రాశి ఫలాలు
మేషం రాశి
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి
ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి. శ్రమధిక్యతతో పనులు పూర్తికావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్య పరుస్తుంది. అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.
మిథున రాశి
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం రాశి
నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.
సింహం రాశి
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.
కన్య రాశి
అదృష్ట ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.
తుల రాశి
చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
వృశ్చికం రాశి
కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి
శుభఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం
మకరం రాశి
చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. గణనాయకాష్టకం పఠిస్తే మంచిది.
కుంభం రాశి
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
మీన రాశి
మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాధన విషయాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అందరినీ కలుపుకపోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. చతుర్ధ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. దుర్గా ధ్యానం శుభప్రదం.
🚩నేటి విశిష్ఠత – ఆరుద్ర నక్షత్రంతో కూడిన, మార్గశిర బహుళ పాడ్యమి🚩
ఆరుద్ర నక్షత్రంతో కూడిన, మార్గశిర బహుళ పాడ్యమి
ఆరుద్ర నక్షత్రంతో కూడిన, మార్గశిర బహుళ పాడ్యమి, సోమవారం. ఆరుద్రోత్సవం.ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య లింగాకారంగా ఆవిర్భవించిన రోజు.ఆ మహాతేజో శివలింగము యొక్క ఆద్యంతములు కనుక్కోవడానికి ప్రయత్నించి విఫలమయ్యి,ఈశ్వర ఆధిపత్యాన్ని అంగీకరించి బ్రహ్మ విష్ణువులు,సకల దేవతలు ఆ లింగాకార ఈశ్వరుడుని పూజించిన రోజు”మహాశివరాత్రి” అని పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి.కాబట్టి ఈ రోజున చేసే శివారాధన కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రదోష కాలంలో చేసే శివారాధన అపార ఈశ్వరానుగ్రహాన్ని కలిగిస్తుందని శాస్త్రవచనం .
🚩ధనుర్మాసం ప్రారంభం🚩
ధనుర్మాసం ప్రారంభం ….
సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.
భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.
ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.
ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు.
ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.
కృష్ణా, కృష్ణా అంటూ గోదాదేవి
తన ప్రతి కదలిక కృష్ణయ్య
తోనే ముడిపడి ఉంటుంది..!
చెలులతోను, చెట్టుతోను, పుట్టతోనూ
శ్రీకృష్ణ కథలు చెప్పి తరిస్తుంది..!
కృష్ణయ్యతో నిరంతరం మాట్లాడుతుంది …
స్వామికి ఇష్టమైన అలంకారాలు ఇష్టమైన ఫలహారాలు అన్ని చేస్తుంది..!
అది కదా భక్తి యన్న….
భగవంతుడిని ఆరాధించడం
అంటే మనసును ఆయనకు నివేదించడం..
ఆయనతో అనుసంధానించబడటం..!
భక్తితో, తన్మయత్వం చెంది ఎవరికి వారు కృష్ణయ్య తన దగ్గరే ఉన్నాడు అని అనుకుంటారు..!
మనసా, వాచా, కర్మణా ఎవరైతే పూర్తి విశ్వాసాన్ని స్వామి యందు ఉంచి కొలుస్తారో వారికి ఆయన సాక్షాత్కారం ప్రతి రోజు కలుగుతుంది…
జై శ్రీకృష్ణ… 🙏🙏🙏
సర్వేజనాః సుఖినోభవంతు